ప.గో జిల్లాలో విషాదం
పోలవరం పట్టిసీమ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు కొత్తూరు తాడేపల్లి సమీపంలోని కాలువ వద్ద శుక్రవారం స్నానం చేసేందుకు దిగారు. ఆరుగురిలో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు, కానీ ఇద్దరు యువకులు తేజ, మున్వర్ కాలువలో కొట్టుకుపోయారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.