పెనుగొండ మాజీ శాసనసభ్యులు కూనపరెడ్డి వీర రాఘవులు కుమారుడు లక్ష్మయ్య నాయుడు ఇటివల కాలం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం స్వయంగా మాజీ ఎమ్మెల్యే కొనుపు రెడ్డి వీర రాఘవులు ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడు లక్ష్మయ్య నాయుడు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు.