పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
నరసాపురం పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మునిసిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ప్రజలు వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.