నరసాపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్ గా బొమ్మిడి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విప్ లు గా 15 మందిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నరసాపురం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే గా ఎన్నికైన బొమ్మిడి నాయకర్ కు విప్ గా పదవి వరించడంపై మంగళవారం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు మరియు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.