ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురం లక్ష్మినరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా ద్వారకాతిరుమల మండల పరిషత్ అధ్యక్షులు బొండాడ మోహిని వెంకన్నబాబు దంపతులు దర్శించుకున్నారు. వారి కుమార్తె అక్షరాభ్యాసం చేసి పాప త్రియా మాహాన్య పెరుమీధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి 1, 50, 000 లక్ష ఏబై వేల రూపాయలు విరాళంగ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని యంపీపీ బొండాడ మోహిని వెంకన్నబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.