గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణపురం గ్రామంలో సోమవారం నుండి ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో పంటలు పూర్తిగా నీట మునిగాయి. వర్షపునీరు బయటకు పోయే మార్గం లేకపోవటంతో జలమయంగా మారాయి. దాదాపు జనజీవనం స్తభించిపోయింది. దీంతో రైతులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు.