ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: యంపిడిఓ శ్రీదేవి

1732பார்த்தது
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: యంపిడిఓ శ్రీదేవి
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ళ పట్టాలు పొందిన ప్రతీ లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకునే విధంగా లబ్ధిదారులను చైతన్యపరిచి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని శనివారం తడికలపూడి గ్రామ సచివాలయం కార్యాలయంలో నవరత్నాలు- పెదలందరికి ఇళ్లు వైఎస్సార్‌ – జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి పై మండల లెవెల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యం పి డి ఓ శ్రీదేవి మాట్లాడుతూ సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం అందించిన స్థలాల్లో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను సూచించారు. నవరత్నాలు- పెదలందరికి ఇంటి నిర్మాణం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రారంభం కానీ ఇళ్లని వెంటనే మొదలు పెట్టాలన్నారు. బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న గృహాలన్నీ బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలన్నారు. బేస్మెంట్ లెవెల్ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న గృహాలన్నీ రూప్ క్యాస్టింగ్ స్థాయికి తీసుకురావాలన్నారు.

ఇంటి నిర్మాణం చేపట్టుకునే వాళ్లకు రూ. 35 వేలు రుణం అందించాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి స్టేజి అప్డేషన్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్ లను లేఅవుట్లకు ఎప్పటికప్పుడు సరఫరా చేసేలా చూడాలని, సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో, పంచాయితీ కార్యదర్శి జి వి సత్యనారాయణ, వెలుగు ఎపియం , వెలుగు సి సి లు , సచివాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி