ఏలూరులో వెలుగు చూసిన సైబర్ మోసం
ఏలూరుకి చెందిన శేషగిరి ప్రసాద్‌కు ఈనెల 8న తన అకౌంట్లోకి రూ. 20 వేలు వచ్చాయి. కాసేపటికి ఓ వ్యక్తి ఫోన్ చేసి పొరపాటున వేశామని తిరిగి తనకు పంపాలన్నాడు. ఆయన మాటలు నమ్మిన శేషగిరి ఆ డబ్బును తిరిగి పంపాడు. ఈనెల10న ఖాతా చెక్ చేయగా రూ. 46. 30 లక్షలు కట్ అయినట్లు గుర్తించాడు. దీంతో మంగళవారం ఏలూరు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించగా వారు దర్యాప్తు చేపట్టామన్నారు.