ఏలూరు జిల్లా కామవరపుకోట గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అలాగే ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.