ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బైపాస్ వద్ద సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ట్రాక్టర్ డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ట్రాక్టర్లపై ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోవద్దు అంటూ ప్రభుత్వం ఇచ్చిన వివరణపై ట్రాక్టర్ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి నేతల ఆధ్వర్యంలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.