చింతలపూడి శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో శుక్రవారం ఎస్సై కుటుంబరావు పాల్గొన్నారు. అనంతరం నూతన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పుస్తక పఠనం అన్నిటిలోనూ అత్యంత విలువైన అలవాటని, అందరూ కచ్చితంగా పుస్తకాలను చదవాలని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.