భీమవరంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం
ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు పేర్కొన్నారు. శనివారం భీమవరంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామరాజు అధ్యక్షత వహించి మాట్లాడారు. నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు.