ఆచంట: నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం
ఆచంట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాధ రాజు మంగళవారం పోడూరు మండలం తూర్పుపాలెం వైస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టంచేసారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ప్రతీ అంశంలోనూ రాజీపడకుండా మేలు చేశామని ఆయన వెల్లడించారు.