హనీ ట్రాప్ లో అన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత తెలిపారు. పథకం ప్రకారం ముఠా ప్లాన్ చేస్తుందని చెప్పారు. నిందితురాలు జమీమీయాకు ముఠా శిక్షణ ఇచ్చిందన్నారు. ఎలా ట్రాప్ చేయాలో, మత్తుమందు ఎలా వెదజల్లాలో, వీడియోలు ఎలా తీయాలో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని అందర్నీ అరెస్టు చేసి తీరుతామని సిపి ఆదివారం మీడియాతో చెప్పారు.