ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించవద్దని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ హితవుపలికారు. బాల్య వివాహాల చట్టం -2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు ఆడ పిల్లలకు, 21 సంవత్సరాల లోపు మగ పిల్లలకు వివాహం చేయడం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన పి. జి. ఆర్. ఎస్. లో అధికారులతో కలిసి బాల్య వివాహాలపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.