వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పరవాడ మండలానికి చెందిన పార్టీ సీఈసీ సభ్యులు పైల శ్రీనివాసరావు మంగళవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఆయన జగన్ కు వివరించారు. నియోజకవర్గంలో సమస్యలను మాజీ సీఎంకు దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.