నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి పీజీ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏయూ వీసీని ఆదేశించారు. గురువారం ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రిని కలిసి పీజీ సీట్లు అడ్మిషన్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన స్పీకర్ వీసీతో మాట్లాడి సీట్లు భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచితే ప్రయోజనం ఉండదన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.