మాడుగుల మండలంలో గల జాలంపల్లి, ఎల్ పోన్నవోలు, గొప్పలపాలెం సచివాలయాల పనితీరును గురువారం ఎండిఓ కే అప్పారావు, జడ్పిటిసి కె రమణమ్మ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సకాలంలో సిబ్బంది కార్యాలయాలకు హాజరుకావాలన్నారు. వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల వినమ్రతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జలంపల్లిలో డయేరియా మూలంగా గతంలో మూసివేసిన బోరును గురువారం తిరిగీ ప్రారంభించారు.