విశాఖ: కూల్ జోన్ అధినేత గణేష్ ఆత్మహత్య
విశాఖలోని పీఎం పాలెంలో గల ఓ హోటల్ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కూల్ జోన్ అధినేత గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను ఆ వీడియోలో వెల్లడించాడు. ఈ మేరకు ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటి క్రితం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.