విశాఖ: దేవస్థానానికి ప్రహ్లాద కళ్యాణమండపాన్ని అప్పగించాలి
విశాఖ నగరంలోని సింహాచలం దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణమండపాన్ని తక్షణమే సింహాచలం దేవస్థానానికి అప్పగించాలని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు ఈ అంశంపై వినతిపత్రం అందించారు.