ఈ నెల 20 నుంచి 27 వరకు వారం రోజులు పాటు జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యాయన యాత్రను జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ వ్యతిరేకించారు. గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నగరంలో నాణ్యమైన రోడ్లు లేవు. నగర పాలక సంస్థ నిధులతో విహార యాత్ర సోకులా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులు ఇలా దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.