విశాఖ సాగర్ నగర్ బీచ్‌లో జీవీఎంసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్‌ను ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చునని అన్నారు. సాగర్ తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.