చోడవరం శివాలయంలో పుష్కర ఘాట్ ని స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘాట్ కి పూర్వం వైభవం తీసుకురావడానికి ప్రజలందరూ ఈ కోనేరులో స్థానం చేసి ఆ మహా శివుని దర్శనం చేసుకునేలా చేస్తానని చెప్పారు. అలాగే గుడి చుట్ట సిమెంట్ రోడ్ , పుష్కర ఘాట్ సంబంధించి సుమారు 70 లక్షల నిధుల మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.