నక్కపల్లి: ఏపీకి పెట్టుబడుల వరద
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పెట్టుబడుల వరద మొదలైందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తను ప్రాతినిత్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో రాజయ్య పేటలో ఉక్కు దిగ్గజ సంస్థలైన ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్స్ ముందుకు రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపన్నారు. రూ. 1. 40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి 20, 000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆదివారం ఎక్స్ లో పేర్కొన్నారు.