విజయనగరం నుంచి తుని పట్టణానికి అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి ఎస్సై సన్నిబాబు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేయగా 46 పశువులు రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాహనాల డ్రైవర్లు ఇద్దరితోపాటు గోవుల రవాణాలో ప్రమేయం ఉన్న ఉన్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేసామన్నారు.