పాడేరు మండలం, సప్పిపుట్టు గ్రామం పాంగి శాంతి అనే యువతీ బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. గత ఏడాదిలో శాంతికి జి. మాడుగుల మండలం, బరిసింగిమెట్ట గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగిందని స్థానికులు తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో గడ్డలో పడివున్న విషయాన్నీ తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విలపిస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.