చట్ట వ్యతిరేక పనులు చేస్తే చర్యలు తప్పవు: అరకు ఎమ్మెల్యే
అరకు ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే, రేగం మత్స్యలింగం ఈ సమీక్ష సమావేశంలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న గృహాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనులు వేగవంతంగా చేయించాలన్నారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తింపజేయాలని అధికారులకు ఆదేశించారు.