అనంతగిరి: ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమం
అనంతగిరి మండలంలోని కొండిబ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు నరాజి మల్లేశ్వరరావు ఆహార పదార్థాల ప్రదర్శనతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. 1945లో యునైటెడ్ నేషన్స్ FAO స్థాపన తేదీని గుర్తించేందుకు అక్టోబర్ 16న ఈ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.