అరకు వ్యాలీ కేంద్రంగా ఉన్న కంట బౌన్సుగుడ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థుల విద్యాబోధనపై ఆరా తీశారు. హెచ్ ఎమ్ తో మాట్లాడుతూ, ప్రతీ రోజూ హోమ్ వర్క్ ఇచ్చి, అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. తరువాత, పాఠశాల వంటగదిలో ఆహార నాణ్యతను పరిశీలించి, వండిన ఆహారాన్ని రుచి చూసి హాస్టల్ వార్డెన్‌ను అభినందించారు.