అరకు: శర వేగంగా పీఎం జన్మన్ గృహా నిర్మాణాలు
అరకులోయ మండలంలోని బస్కి పంచాయతీ పరి గాయబంధ గ్రామంలో పీఎం జన్మన్ పథకం ద్వారా గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గాయబంధ గ్రామంలో మొత్తం 16 మంది పిబిటిజి గిరిజనులకు గృహాలు మంజూరయ్యాయని లబ్ధిదారులు ధర్మ తదితరులు తెలిపారు. పేద పివిటిజి గిరిజనుల కోసం ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఒక గృహానికి రూ.2.39 లక్షల చొప్పున మంజూరు చేసిందని లబ్ధిదారులు ప్రధాని నరేంద్రమోడీకి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు.