హుకుంపేట మండలంలోని పలు గ్రామాల్లో అడవి పందులు, పక్షుల నుంచి పంటను రక్షించేందుకు కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. టీ.బొడ్డపుట్టు పంచాయతీ పరిధి ములక్కాయపుట్టులో రైతులు మిర్చిచ కంది తదితర పంటలను సాగు చేశారు. పంటను అడవి పందులు పక్షులు నాశనం చేస్తున్నాయి. వాటి బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించి రంగు రంగు పాత చీరలను కొనుగోలు చేసి పొలాల చుట్టూ కంచే కట్టి పంటలను రక్షించుకుంటున్నారు.