విశాఖ: పలువురు మద్యం ప్రియులపై కేసులు
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నవారిపై కేసులు నమోదు చేశారు. విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించారు. మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.