మత్స్యకారులకు హెచ్చరిక..
ఉత్తరాంధ్ర మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణకేంద్రం హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్లో అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 23 నాటికి అది తుఫానుగా మారి 24న ఒడిషా-బెంగాల్ తీరాలకు చేరే సూచనలు ఉన్నాయి. ఈ ప్రభావంతో 24, 25 తేదీల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు.