మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ఆరోగ్యకరమైన తాగునీటి సరఫరా కోసం కృషి చేస్తోందని జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన విశాఖలోని బర్మాకాలనీ బ్లాక్ 18లో నీటి సరఫరా పంప్ హౌస్‌ను పరిశీలించారు. అక్కడ రోజుకు 10 ఎంఎల్డీ తాగునీటిని లక్షమందికి సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాగునీటి కలుషితం కాకుండా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.