గాజువాకలో కూర్మన్నపాలెం ఉక్కు నిరాహార దీక్ష శిబిరం వద్ద వచ్చే నెల రెండవ తేదీన సత్యాగ్రహ దీక్ష చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శుక్రవారం నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేపట్టనున్నారు. 6వ తేదీన అగనంపూడి నుంచి పాత గాజువాక వరకు మానవహారం చేపట్టనున్నట్లు పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, కేఎస్ఎన్ రావు అయోధ్యరాం, శ్రీనివాసరావు తదితరులు తెలిపారు.