కూటమి ప్రభుత్వం పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పల్లెల్లో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస మండలం నిమ్మలపాలెం, దేవాడ, గొల్లల పాలెంలో బుధవారం జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పల్లెల్లో ఈనెల 20 వరకు పల్లె పండగ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆయా గ్రామాల్లో రూ. 41లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.