జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, ప్రమాదాల్లో మరణాలు సంభవించిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా పోలీసుశాఖ గుర్తించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. కాగా గుర్తించిన బ్లాక్ స్పాట్స్ ను డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, నేషనల్ హైవే అధారిటీ, మున్సిపల్, రోడ్లు భవనాలు, రవాణ శాఖ అధికారులు సంయుక్తంగా సందర్శించి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుటకు గల కారణాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.