పార్వతీపురం పట్టణంలో బైపాస్ రోడ్ లో టైర్స్ అండ్ ఆటోమొబైల్స్ దుకాణం అగ్నికి ఆహుతి అయింది. బాధితులు తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర దగ్దమైన దుకాణాన్ని సోమవారం సందర్శించి, అగ్ని ప్రమాద వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. ప్రమాద కారణాలు నష్టం తదితర విషయాలను తెలుసుకున్నారు. భాదితునికి ప్రభుత్వపరంగా ఏదైనా సహాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని భరోసానిచ్చారు.