మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఇందుకు సంబందించిన బ్యాంకు గ్యారంటీ( బీజీ )లను తక్షణమే అందజేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక రైస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో రూ. 168 కోట్ల మేర బీజీలు రావలసి ఉండగా, ఆశించినంత స్థాయిలో అందలేదన్నారు.