భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో త్రాగునీరు వృధాగా పోతోంది. త్రాగునీరు పంపిణీ చేసే పైపులైన్లు లీకేజీల కారణంగా త్రాగునీరు వృధాగా పోతోందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలకు సరిపడా మంచినీరు అందడం లేదని వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని గ్రామస్తులు అంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పైపులైన్ల లీకేజీలు మరమ్మతులు చేపట్టి మంచినీటి వృధాను అరికట్టాలని కోరుతున్నారు.