బొబ్బిలి పురపాలక సంఘ కార్యాలయాన్ని శనివారం విశాఖపట్నం ప్రాంతీయ పురపాలక సంచాలకులు వి. రవీంద్ర సందర్శించరు. ఈ సందర్బంగా ఆయన రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల శాఖా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరు. ఇంటింటి చెత్త సేకరణ, శాగ్రిగేషన్, ప్రైమరీ ట్రాన్స్పోర్ట్, సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ జరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ , సిబ్బంది పాల్గొన్నారు.