ఆడపిల్లలు పట్ల వివక్షత చూపితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆర్‌డిఒ రామ్మోహనరావు కోరారు. బొబ్బిలి ఆర్‌డిఒ కార్యాలయంలో బుధవారం పిసి అండ్ పిఎన్డిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు పట్ల వివక్షత చూపితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగవివక్షత చూపడం చట్టరీత్యా నేరమన్నారు. ల్యాబ్‌లలో లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.