జామి: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధ ప్రబోధకులు నాయుడు పిలుపునిచ్చారు. జామి మండలం భీమసింగిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 5న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేశారు.