బొబ్బిలి: ధీపం పథకంతో ప్రతి కుటుంబంలో సంతోషం: ఎమ్మెల్యే
ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా కూటమి ప్రభుత్వం ధీపం-2. 0 పథకాన్ని ప్రారంభించిందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారుల సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు.