ఆపత్కాలంలో ఆదుకునే అంబులెన్సు వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని 108 సిబ్బంది డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో గురువారం గేదెల వేణుగోపాల్ నాయుడు, మండంగి శోభన్ బాబు, కాటికి మహేశ్వర్ రావు, రాంబారికి రాంబాబు, బప్పు అప్పారావు, పతివడం వెంకట రమణల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రస్తుత కంపెనీ నుంచి ఉద్యోగులకు రావలసిన బకాయిలు చెల్లించాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.