బాలాయపల్లి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలంలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరకున్న చిన్నారి బంధువులను చూసి నిందితుడు పరారయ్యాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.