తిరుపతి జిల్లా నాయుడుపేటలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మున్సిపాలిటీ కౌన్సిలర్ సమావేశం హాలు సీలింగ్ బుధవారం సాయంత్రం కింద పడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఫజులల్లా మాట్లాడుతూ. తక్షణమే మరమ్మతులు చేపట్టుతామని తెలియజేశారు.