తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో మంగళవారం తేలికపాటి వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మబ్బులు నల్లగా కప్పుకొని ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతవరణం చల్లబడింది. గత వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం లభించింది.