శ్రీసిటీ పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటుకు ఎనలేని కృషిచేసిన శ్రీసిటీ ఛైర్మన్ శ్రీనిరాజుకు, ఎండి రవి సన్నారెడ్డికి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగ కల్పనకు అహర్నిశలు కృషి చేస్తూ, రాష్ట్ర సంపదను సృష్టించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు రుణపడి ఉన్నామన్నారు. సీఎం శ్రీసిటీకి రావడం నిరుద్యోగ యువతకు ఓ వరమన్నారు.