పుంగనూరు పట్టణంలో ఘర్షణ కేసులో ముగ్గురు వైసీపీ నాయకులను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్దిరోజులు మనకు పట్టణంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి వద్ద జరిగిన ఓ గొడవలో పట్టణానికి చెందిన అస్లాంబాషా(36), ఖాదర్ వల్లీ (56), చెంగలాపురానికి చెందిన నరసింహరావు (50)లను అరెస్ట్ చేశామన్నారు. కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్ విధించినట్లు తెలిపారు.